హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా నిల్వలపై వ్యవసాయశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా స్టాక్74.29 లక్షల బస్తాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. రీటెయిలర్స్ వద్ద 15.65 లక్షల బస్తాలు అందుబాటులో ఉండగా, సహకార సంఘాల వద్ద 6.50 లక్షల బస్తాలు నిల్వలు ఉన్నాయి. గోదాముల్లో 1.98 లక్షల యూరియా బస్తాల నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసింది. నోడల్ ఏజెన్సీ మార్క్ఫెడ్ వద్ద అత్యధికంగా 50.16 లక్షల యూరియా బస్తాలు ఉన్నట్లు వెల్లడించింది.
ఇప్పటి వరకు 75.03 లక్షల బస్తాలు బుక్ చేసుకోగా వాటిలో 67.89 లక్షల బస్తాలను ఇప్పటికే కొనుగోలు చేసినట్టు పేర్కొంది. మరో 21.70 లక్షల యూరియా బస్తాలను యూరియా యాప్ ద్వారా రైతులు తాజాగా బుక్ చేసుకున్నట్లు తెలిపింది. యూరియా యాప్ ద్వారా మొత్తం 90.48 శాతం రైతులు యూరియా కొనుగోలు చేసినట్టు వివరించింది.
