బీసీ రిజర్వేషన్ల విచారణ అక్టోబర్ 9కి వాయిదా

బీసీ రిజర్వేషన్ల విచారణ అక్టోబర్ 9కి వాయిదా

బీసీ రిజర్వేషన్లపై విచారణను అక్టోబర్ 9 కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.. రేపు మధ్యాహ్నం 2: 15 గంటలకు విచారణను వాయిదా వేసింది కోర్టు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో అక్టోబర్ 8న  వాదనలు వాడివేడీగా కొనసాగాయి.  

 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. వీటిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వాదనలు ఆసక్తిగా జరిగాయి. అక్టోబర్ 8న ఉదయం పిటిషనర్ల తరపున లాయర్లు వాదనలు వినిపించగా.. మధ్యాహ్నం ప్రభుత్వం తరపున అడ్వకెట్ జనరల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.

ప్రభుత్వం తరపున  అభిషేక్ మను సింఘ్వీ వాదనలు

  • దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లును సమర్థించాయి
  • చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదు
  • కాకపోతే చట్టం ఆధారంగా జారీ చేసిన జీవోలను ఛాలెంజ్ చేశారు
  • జీవోకు మూలమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేయడం కుదరదు
  • రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతం దాటకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశమే తప్పితే రాజ్యాంగంలో ఎక్కడా ఎలాంటి నిబంధన ఈ పరిమితి విధించలేదు
  • డేటా ఆధారంగా ప్రభుత్వానికి, శాసన వ్యవస్థకు తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఉంది
  • 2018లో తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం పాసైన సమయంలో ఈ కసరత్తు జరగలేదు
  • 2019లో EWS 10 శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. 
  • ఫలితంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటి అదనంగా 10 శాతం అంటే మొత్తం రిజర్వేషన్ల శాతం 60 శాతానికి చేరుకుంది. 
  • ఎంపిరికల్ డేటా ఉంటే గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు
  • గవర్నర్ కి పంపిన బిల్లును ఆమోదించలేదు, అలాగని వెనక్కి పంపనూ లేదు
  • గవర్నర్ కి బిల్లును పంపి నెల కాదు, 6 నెలలు గడిచాయి
  • చట్టాన్ని సవాల్ చేయకుండా.. కేవలం ఆ చట్టం ఆధారంగా జారీ చేసిన జీవోపై మాత్రమే అభ్యంతరాలు చెబుతూ పిటిషనర్ల వాదనలు జరిగాయి
  • బిల్లులు పాస్ చేసే విషయంలో చట్ట సభల్లో భిన్నాభిప్రాయాలు, గొడవలు ఉంటాయి
  • కానీ ఈ బిల్లును అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఆమోదించి పాస్ చేశాయి
  • లక్ష మంది ఎన్యుమరేటర్లు సమగ్రంగా సర్వే నిర్వహించారు
  • ఇదేదో ఫోర్జరీ చేసిన డేటా అని పిటిషనర్ అనుకుంటున్నారేమో.. 
  • కులగణన సర్వే కోసం ప్రభుత్వం ఎంతో శ్రమించింది, ప్రొఫెసర్లు, టీచర్లు ఎంతో మంది ఈ సర్వేలో భాగంగా ఉన్నారు
  • ఏక సభ్య కమిషన్‌ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 42 శాతానికి బీసీ రిజర్వేషన్ల పెంపు జరిగింది..  97 శాతం ఇంటింటి సర్వే జరిగింది.

 ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు

  •  గవర్నర్ బిల్లును ఆమోదించలేదు కాబట్టి  బిల్లుకు ఆమోదం లభించినట్టుగా భావిస్తూ ప్రభుత్వం నోటిఫై చేసిందా?.  
  • ఎక్స్‌ట్రా ఆర్డినరీ గెజిట్‌లోనే నోటిఫై చేసినప్పుడు మాత్రమే దాన్ని చట్టంగా పరిగణించగలం కదా?. 
  • బిల్లులో తీసుకొచ్చిన సవరణలనే తర్వాత ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారా? 
  • కమిషన్ డేటాను పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదా?.
  •  కమిషన్ డేటాను పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదా?. 
  • ప్రజల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించిందా? ఈ మేరకు కొన్ని తీర్పులున్నాయి కదా? 
  • ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ఇచ్చారు.?

 సెప్టెంబర్ 29 ఎన్నికలు షెడ్యూల్ వచ్చిందని అడ్వొకేట్ జనరల్ అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. దీనిపై  రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామని తెలిపారు.