Vyooham: వ్యూహం సినిమాకు మరో షాక్.. రిపోర్ట్ వచ్చేవరకు ఆగాల్సిందే

Vyooham: వ్యూహం సినిమాకు మరో షాక్.. రిపోర్ట్ వచ్చేవరకు ఆగాల్సిందే

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం(Vyooham) సినిమాకు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో చిత్ర యూనిట్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా స్పందించిన హైకోర్టు.. ఈ నెల 9లోగా సెన్సార్ బోర్డ్ రిపోర్ట్ ఇవ్వాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇటీవలే వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ కోర్టు తీర్పును వెల్లడించింది. అదేవిధంగా సినిమాపై సెన్సార్ బోర్డు రివ్యూ చేసి నాలుగు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.

కాగా, టీడీపీ నేత నారా లోకేష్ వ్యూహం సినిమాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తమ రాజకీయ స్వలాభం కోసమే వ్యుహం సినిమాను తెరకెక్కించారని పిటిషన్‌లో పేర్కొన్నారు లోకేష్. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఫిబ్రవరి 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు చిత్ర నిర్మాత. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది.