
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పేపర్లో వచ్చిన క్లిప్పింగ్‌ల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం (సెప్టెంబర్ 24) విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేశారని పిటిషనర్‌ను నిలదీసిన హైకోర్టు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం మీకు ఏదైనా కాపీ ఇచ్చిందా అని ప్రశ్నించింది. వార్త పత్రికల్లో వచ్చినా కథనాల ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం పేపర్ క్లిప్పింగ్స్‌ను బేస్ చేసుకుని పిటిషన్ వేయడం సరికాదని పిటిషనర్‌కు చురకలంటించింది.