ఇళ్ళ మధ్యలో పబ్ లు.. రేపటి లోగా పూర్తి వివరాలు ఇవ్వాలి

ఇళ్ళ మధ్యలో పబ్ లు.. రేపటి లోగా పూర్తి వివరాలు ఇవ్వాలి

ఇళ్ల మధ్యలో పబ్ ల ఏర్పాటుపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. పబ్ ల దగ్గర నూసెన్స్ ను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. శబ్ద కాల్యుషం, ట్రాఫిక్ మానేజ్మెంట్  పై యాక్షన్ ప్లాన్ ఏంటని నిలదీసింది. హైదరాబాద్ లోని పబ్ లపై విచారణ జరిపింది హైకోర్టు. ఇళ్ళ మధ్యలో పబ్ ల ఏర్పాటుతో ట్రాఫిక్ జామ్ లు, యాక్సిడెంట్లతో పాటు.. వాయిస్ పోల్యూషన్ ఎక్కువైందని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు. దీంతో పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ విషయంలో సుప్రీకోర్టు గైడ్లైన్స్ పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. దీంతో వివరాలు ఇచ్చేందుకు సమయం కోరారు అడిషనల్ ఏజీ. నిరాకరించిన హైకోర్టు రేపటి లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.