టాలీవుడ్ వర్సటైల్ డైరెక్టర్ కం యాక్టర్ రవిబాబు సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇటీవలే రవిబాబు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రేజర్’.. మే 8న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ‘రేజర్’ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఆహా ప్లాట్‌ఫామ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ వీకెండ్ (జూన్ 19) నుంచి రేజర్ కేవలం ఆహాలో స్ట్రీమ్ అవ్వనుందని అధికారికంగా ప్రకటించింది.
తనదైన హారర్, కామెడీ జానర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ క్రియేటివ్ డైరెక్టర్, ఈసారి తన రూట్ మార్చి మితిమీరిన హింసతో రావడంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ, రేజర్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సినీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. యాక్షన్ లవర్స్‌కు, ముఖ్యంగా రవిబాబు వైల్డ్ అవతార్‌ను చూడాలనుకునే వారికి వీకెండ్‌లో ‘రేజర్’ మంచి ఛాయిస్‌గా నిలవనుంది.
తనీష్ అల్లాడి, ఇనాయా సుల్తానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బేబీ తేజల్ విఖ్యాతి, బెనర్జీ, వీరన్న చౌదరి, రామరాజు కీలక పాత్రలు పోషించారు. రవిబాబు దర్శకత్వంతో పాటు దగ్గుబాటి సురేష్ బాబుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ సినిమాలో ఎక్కువ క్రైమ్ సన్నివేశంలో ఉండటంతో థియేటర్లలో ‘A’ సర్టిఫికేట్తో విడుదలైంది.
‘A’ సర్టిఫికేట్: ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.
One CCTV footage. One little girl in danger. One man with a past darker than the truth itself.#Razor premieres June 19, only on #aha. pic.twitter.com/Qrv4lHHASI
— Telugu Film Journalists Association (@FilmJournalists) June 15, 2026
కథేంటంటే..
విష్ణు (తనీష్) సీసీటీవీ కెమెరాల బిజినెస్ రన్ చేస్తుంటాడు. అంతా సాఫీగా సాగిపోతున్న క్రమంలో, విష్ణు అమర్చిన ఒక సీసీ కెమెరాలో స్టేట్ చీఫ్ మినిస్టర్ సీతారామయ్య (రామరాజు) దారుణ హత్యకు గురైన దృశ్యాలు రికార్డ్ అవుతాయి. ఈ దారుణానికి ఒడిగట్టింది మరెవరో కాదు.. సీఎం పీఠంపై కన్నేసిన హోం మినిస్టర్ కనకరాజు (వీరన్న చౌదరి). ఈ సాక్ష్యం ఎక్కడ బయటపడుతుందోనని కనకరాజు గ్యాంగ్ విష్ణుని చంపేస్తారు.
►ALSO READ | 'దేవర 2' అప్‌డేట్ ప్లీజ్.. కొరటాల బర్త్‌డే వేళ నెట్టింట షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
చనిపోయే ముందు విష్ణు ఆ వీడియో క్లిప్‌ను త్రీ-లేయర్ పజిల్‌గా మార్చి, తన చిన్నారి కూతురు తేజు (బేబీ తేజల్ విద్యాతి) బొమ్మలో దాచేస్తాడు. కళ్ల ముందే తండ్రిని కోల్పోయి, హోం మినిస్టర్ గూండాల బారిన పడ్డ ఆ పాపను కాపాడటానికి రుద్ర ప్రతాప్ అలియాస్ రేజర్ (రవిబాబు) అనే మొబైల్ పెట్ గ్రూమర్ ఎంటర్ అవుతాడు. అస్సలు ఈ రేజర్ వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? ఆ రౌడీల వేట నుండి ఆ చిన్నారిని అతను ఎలా కాపాడాడు? అన్నదే మిగిలిన కథ.
