టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాకు సామాజిక బాధ్యతను అద్ది.. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్ల సునామీ సృష్టించే ఏకైక 'మిర్చి’ లాంటి దర్శకుడు కొరటాల శివ. 'శ్రీమంతుడు'గా టాలీవుడ్‌కు సందేశాన్నిస్తూనే 'జనతా గ్యారేజ్' పెట్టి రికార్డులను రిపేర్ చేసిన ఈ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ఈ రోజు ( జూన్ 14న ) తన 51వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీలు, టాప్ ప్రొడక్షన్ హౌసెస్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ నెట్టింట హంగామా సృష్టించాయి.
బాలయ్యతో ‘ఫెస్టివల్’ లోడింగ్..
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌తో 'దేవర’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న శివ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను నందమూరి నటసింహం బాలకృష్ణతో అనౌన్స్ చేసి టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ #NBK112 గా తెరకెక్కుతున్న ఈ సినిమా మేకర్స్ కొరటాల శివకు క్రేజీ బర్త్‌డే విషెస్ చెప్పారు. 'ది స్టార్స్ అలైన్.. ఎ ఫెస్టివల్ అవేట్స్' అంటూ రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం ఉండబోతోందో హింట్ ఇచ్చింది. 'మా డియరెస్ట్ కొరటాల శివ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కోట్లాది మందిని అలరించే మరిన్ని అద్భుతమైన కథలతో మీరు విజయవంతంగా దూసుకుపోవాలి' అంటూ చిత్ర యూనిట్ విష్ చేసింది. బాలయ్య బాబు మాస్ ఇమేజ్, కొరటాల శివ ఎలివేషన్స్ తోడైతే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని నందమూరి ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
Happy Birthday to blockbuster director #KoratalaSiva Garu ❤🔥
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 15, 2026
Have a fantastic year ahead filled with happiness, good health, and many more memorable cinematic milestones ✨ pic.twitter.com/jBYMM9Ek4l
స్పెషల్ విషెస్!
కొరటాల శివకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన 'మిర్చి' మేకర్స్ యూవీ క్రియేషన్స్, అలాగే 'జనతా గ్యారేజ్' నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఆయనకు శుబాకాంక్షలు తెలిపాయి. తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ను మార్చిన ఇంపాక్ట్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కు బర్త్‌డే విషెస్ అంటూ కొనియాడాయి. జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Happy Birthday Siva!
— Jr NTR (@tarak9999) June 15, 2026
A storyteller who turns simplicity into something unforgettable. Wishing you many more years of inspiring cinema. pic.twitter.com/9TYYWejC3N
ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురి 'దేవర 2' పైనే..
ఇదంతా ఒకెత్తయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో మరో రేంజ్ రచ్చ చేస్తున్నారు. శివకు బర్త్‌డే విషెస్ చెబుతూనే.. 'దేవర 2' అప్‌డేట్ ఎప్పుడంటూ ట్రెండ్ చేస్తున్నారు. 'శివ గారు.. ఇదంతా బానే ఉంది కానీ, మా దేవర సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది? ప్రపంచమంతా ఆ సముద్రపు రక్తాన్ని చూడటానికి వెయిట్ చేస్తోంది' అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి అటు బాలయ్యతో హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఇటు ఎన్టీఆర్‌తో 'దేవర 2'.. ఇలా కొరటాల శివ లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పూనకాలు గ్యారెంటీగా కనిపిస్తున్నాయి..
A filmmaker who made substance a celebration 🌊
— Devara (@DevaraMovie) June 15, 2026
Team #Devara wishes their captain #KoratalaSiva garu a very Happy Birthday 💥💥#HBDKoratalaSiva pic.twitter.com/om2Rgyj9wE
