ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. ఇంటి నిర్మాణం విషయంలోనే కాదు.. ప్రహరీ గోడ నిర్మాణంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంటికి .. ప్రహరీ గోడ కట్టాలనుకొనే స్థలానికి మధ్యన పెద్ద చెట్లు ఉంటే తీసెయ్యాలా.. అలానే కట్టుకోవచ్చా.. అలానే.. ఉత్తరం రోడ్ ఉన్న ప్లాట్లో ఇంటిని నిర్మించేటప్పుడు.. బెడ్ రూమ్.. కిచెన్ ఏ దిక్కులో ఉండాలి.. ఎలాంటి షేప్ లో ఉండాలి.. మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న: కొత్తగా తీసుకున్న ఇంటికి ప్రహరీ గోడ కట్టుకోవాలనుకుంటున్నాం. ప్రహరీ కట్టే ప్లేస్ లో పెద్ద చెట్లు ఉన్నాయి. ప్రహరీకి, ఇంటికి మధ్య ఉన్న చెట్లను తీసేయాలా? అలాగే కట్టుకోవాలా? పెద్ద చెట్లు ఉంటే ఏమైనా దోషమా ?
జవాబు: ఇంటికి నైరుతిలో చెట్లు ఉంటే మంచిది. వాటిని అలాగే ఉంచి ప్రహరీ కట్టుకోవచ్చు. అయితే తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో బరువు ఉండకూడదు. అలాగే పండ్లు, పూల మొక్కలు ఉంటే తీసేయకూడదు.
ప్రశ్న: కొత్తగా కొన్న ప్లాట్ కు ఉత్తరం వైపు రోడ్ ఉంది. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. బెడ్రూమ్, కిచెన్ ఏవైపు కట్టుకోవాలి?
జవాబు: ఉత్తరం వైపు రోడ్ ఉన్న ఇంటికి కిచెన్ తూర్పు ఆగ్నేయంలో ఉండాలి . బెడ్రూమ్ దక్షిణ నైరుతి, పడమర నైరుతిలో కట్టుకుంటే మంచిది. రూమ్ లో వాయువ్యం లేదా ఆగ్నేయం వైపు బాత్రూమ్ ఉండాలి. ఇతర గదుల్ని కూడా వాస్తు ప్రకారమే కట్టుకోవాలి బిల్డింగ్ షేప్ రెక్టాంగిల్ లేదా స్క్వేర్ లో ఉండాలి
