కేసీఆర్ నిర్లక్ష్యంవల్లే మెట్రోకు రూ.7వేల కోట్లు నష్టం : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ నిర్లక్ష్యంవల్లే  మెట్రోకు రూ.7వేల కోట్లు నష్టం : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజల అవసరాలకు  తగ్గట్టుగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.గత బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం , ఆలస్యం వల్లే  మెట్రో విస్తరణ పూర్తి కాలేదన్నారు. 2015లో పూర్తి కావాల్సిన మెట్రోను 2020 వరకు పొడిగించడంతో నిర్మాణ వ్యయం అంచనా పెరిగిందన్నారు. కేసీఆర్ మూడేళ్లు డిలే చేయడం వల్లే రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 

హైదరాబాద్ నగరాన్నిప్రపంచ నగరంగా తీర్చి దిద్దేందుకు కాంగ్రెస్ హాయాంలో మెట్రో రైలు నిర్మాణానికి పునాది పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  2004లో హైదరాబాద్ నగరంలో మెట్రో నిర్మాణానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ నేతృత్వంలో పనులు మొదలయ్యాయన్నారు సీఎం.ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో 15వేల కోట్ల అంచనా వ్యయంతో మెట్రో నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అయితే 2015లో అధికారంలోకి వచ్చి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం  నిర్లక్ష్యంతో దాదాపు మూడేళ్లలో 7వేల కోట్ల అంచనా వ్యయం పెరిగిందన్నారు. 

కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణకు సాయం అందించాలని కేంద్రానికి అనేక సార్లు విజ్ణప్తి చేశామన్నారు సీఎం. అయితే కేంద్రం విస్తరణకు సహకరించలేదన్నారు.  మరోవైపు  నిర్మాణం వ్యయం పెరగడం, ఏటా వస్తున్న నష్టాలతో ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో విస్తరణకు ముందుకు రాలేదన్నారు. ఎల్ అండ్ టీ సంస్థనుంచి 30వేల కోట్లు ఆస్తులన్న  మెట్రోను రూ. 15 వేలకు ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.