ఫీజర్‌‌ బాక్సులపై హైకోర్టు విచారణ క్లోజ్‌‌

ఫీజర్‌‌ బాక్సులపై హైకోర్టు విచారణ క్లోజ్‌‌

హైదరాబాద్,  వెలుగు :  హైదరాబాద్‌‌లోని గాంధీ ఆస్పత్రిలో డెడ్ బాడీలను భద్రపరిచే ఫీజర్‌‌ బాక్స్‌‌ల నిర్వహణ దారుణంగా ఉందని దాఖలైన పిల్‌‌పై విచారణను హైకోర్టు క్లోజ్‌‌ చేసింది. మొత్తం 90 బాక్సులకుగాను 8 మాత్రమే రిపేరులో ఉన్నాయని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ కోర్టుకు చెప్పారు. వాటిని కూడా ఆఫీసర్లు రిపేర్లు చేయించారని వెల్లడించారు.  ఏజీ వివరణను నమోదు చేసుకున్న చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ శ్రవణ్‌‌కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ పిల్‌‌పై విచారణ అవసరం లేదని తేల్చింది. 

విచారణను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపింది. గాంధీ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలను భద్రపర్చేందుకు 90 ఫీజర్‌‌ బాక్సులకుగాను 15 మాత్రమే పనిచేస్తున్నాయని పేర్కొంటూ ఇటీవల ఓ ఇంగ్లిష్ పేపరులో వచ్చిన వార్తను హైకోర్టు పిల్‌‌గా పరిగణించి విచారించింది. పత్రికలో వార్త వచ్చినప్పుడు8 మాత్రమే రిపేరులో ఉన్నాయని..వాటిని ఇప్పుడు బాగు చేశామని ఏజీ చెప్పడంతో కోర్టు విచారణను ముగించింది.