హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ కార్పొరేషన్‌లో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఎండీ వీపీ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట పీడీగా జబ్బర్ అహ్మద్, ఆదిలాబాద్ పీడీగా భగవంతరావు, వికారాబాద్ పీడీగా సయ్యద్ ముక్రం బాబా, కొత్తగూడెం పీడీగా సవాయ్ రామ్, జగిత్యాల పీడీగా భాస్కర్‌ను నియమించారు. నల్గొండ ఎస్ఈగా పనిచేస్తున్న రాజ్ కుమార్‌ను కార్పొరేషన్ హెడ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు.
