ఎలా సాధ్యం: 2024లో కొన్న కొత్త కారుకు.. 2020 నాటి పెండింగ్ చలాన్

ఎలా సాధ్యం: 2024లో కొన్న కొత్త కారుకు.. 2020 నాటి పెండింగ్ చలాన్

2024లో కొన్న కొత్త కారు కొంటే 2020 నాటి పెండింగ్ చలాన్లు.. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..! మన తెలంగాణలో ఇది సాధ్యమైంది. ఈ విషయాన్ని 'నైట్ ఔల్' అనే ఎక్స్(ట్విట్టర్) యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన స్నేహితుడు 2024లో కొత్త కారు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నారని.. అయితే, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లో 2020 నుంచే ట్రాఫిక్ చలాన్‌ నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ సమస్యకు నగర ట్రాఫిక్ పోలీసులే పరిష్కారాన్ని అందించాలని విన్నవించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

ఆదిత్య 369 మూవీలో సన్నివేశంలా..!

సినీనటుడు బాలక్రిష్ణ నటించిన ఆదిత్య 369 మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. భవిష్యత్తులో జరగబోయే విషయాలను టైమ్ ట్రావెలింగ్ మెషిన్ ద్వారా తెలుసుకోవచ్చని ఆ మూవీలో చూపించారు.  యూజర్.. అచ్చం అదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు భవిష్యత్తును ముందే ఊహించి 'టైమ్ ట్రావెలింగ్ ట్రాఫిక్ టికెట్?' విధించారా..? అని ప్రశ్నించారు.

" నా స్నేహితుడు తన టాటా నెక్సాన్ కారును డిసెంబర్ 22, 2023న కొనుగోలు చేశాడు. దానిని జనవరి 6, 2024న రిజిస్టర్ చేసుకున్నాడు. సందేహంతో తన కారుపై ఏవేని చలాన్లు ఉన్నాయా! అని తనిఖీ చేయగా.. 2020, డిసెంబర్ 14న చలాన్ వేసినట్లు కనుగొన్నాడు. నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో(ఇంప్రొపర్ నంబర్ ప్లేట్) రూ200 జరిమానా విధించారు.. బాగుంది. మరి ఆ సమయంలో ఆయకు కారు లేదు. ఈ చలాన్ ఎలా విధించారు. హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసుల్లారా..! దయచేసి ఒక పరిష్కారాన్ని అందించండి.." అని 'నైట్ ఔల్' అనే ఎక్స్(ట్విట్టర్) యూజర్ ఒక పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. బహుశా..! వీరి వద్ద టైమ్ మెషిన్ ఉందని చెప్తారో.. ఏమో..!