కేసీఆర్ చేసిన పది మోసాలు ఇవే

కేసీఆర్ చేసిన పది మోసాలు ఇవే

కేసీఆర్ మోసాలను పసిగట్టడంలో ముందుగా తెలంగాణ మేధావి లోకం విఫలమైంది. అలాగే తెలంగాణలోని కవులు, వాగ్గేయకారులు కూడా తమ అభిప్రాయాలను సాహిత్యంలో వెల్లడించకపోవడం తెలంగాణ సమాజానికి పెద్ద విషాదం. నూటికి 55 శాతం బీసీలు, మిగతా 30 శాతం ఎస్సీ, ఎస్టీలు కల్గిన తెలంగాణ సామాజిక సమూహాలను తప్పుదోవ పట్టించి, కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ మోసాలకు  ఈ పది సంవత్సరాల పాలనలో పాల్పడ్డారు.

కేసీఆర్ వర్గానికి చెందిన  పిడికెడు మంది  తెలంగాణలో కాంట్రాక్టర్లుగా, సబ్ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి, నాలుగు వందల సంవత్సరాల ముందుకు ఆర్థికంగా, సామాజికంగా బలపడ్డారు. మిగతా తెలంగాణ సమాజమంతా తిరిగి మోసాలకు లోనై రెండు వందల సంవత్సరాలు ఆర్థికంగా వెనుకబడ్డ నిజం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇకపోతే కేసీఆర్ చేసిన పది మోసాలు చూద్దాం.

1. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే నినాదంతో 2014 ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచాక తానే ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్న మోసగాడు కేసీఆర్.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే నినాదంతో 2014 ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచాక తానే ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్న మోసగాడు కేసీఆర్.

2. ఆంధ్రా ఆధిపత్య ప్రాంతాల నాయకులను ఉద్యమ సమయంలో తూలనాడిన కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఆ నాయకులతోనే చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతూ వేలకోట్ల  రూపాయల కాంట్రాక్ట్ లను ఆంధ్ర పెద్దోళ్లకే కట్టబెట్టారు.

3. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కొత్త సీసాలో పాత సారాతో నింపాడు. ఏమార్చి తన మాటలతో చాతుర్యంతో ఇవి చాలా గొప్ప పథకాలని ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు.

4. తెలంగాణను ఇప్పటికే ఆరు లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు. మద్యం ద్వారా 36 వేల కోట్లు ఆదాయాన్ని రాబట్టుకొని తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చాడు. పేద ప్రజల జీవితాలను ఆర్థికంగా, సామాజికంగా కోలుకోలేని దెబ్బ కొట్టిండు. మద్యం పేరిట వేల కోట్లు గుంజి పెన్షన్ పేరిట కొంత పంచి తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో అభిమానం అని మాటల గారడీ చేస్తూ కొత్త తరహా మోసం చేయడంలో ఆయనకు ఆయనే సాటి.

5. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో 10శాతంలోపు  కేటాయించి ఆచరణలో పేద ప్రజలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తూ మోసగిస్తుండు.

6. వివిధ నివేదికల ద్వారా 2 లక్షల ఉద్యోగ ఖాళీలుఉన్నాయని ఉద్యమ సమయంలో కేసీఆరే చెప్పారు. కానీ,  ఇప్పటి వరకు ఆయన ఒక్క డీఎస్సీ పెట్టకుండా ఉన్న గొప్ప నాయకుడు కేసీఆర్​. విడుదల చేసిన నోటిఫికేషన్​లు మొత్తం కోర్టుల చుట్టు  చేరి ఆగిపోవడం.పరీక్ష నిర్వాహణకు వచ్చినవి లీక్ కావడం, మళ్లీ పరీక్షలు ఆగిపోవడం తెలంగాణలో పరిపాటైంది. ఉద్యమంలో ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువతను మోసం చేస్తూ కేసీఆర్ పదేండ్లు గడిపిండు.

7. తెలంగాణ సాహిత్య రంగంలో తనకు వంత పాడిన తాబేదారులకు తన దర్బార్ ఆస్థాన కవులుగా ఉంచుకునేందుకు పదవులు కట్టబెట్టిన ఆధునిక రాజు కేసీఆర్. సాహితీ రంగంలో అవార్డుల పేరుతో భ్రమలు కల్పిస్తూ తద్వారా ధిక్కార తెలంగాణ  సాహిత్యాన్ని మట్టుబెట్టిన ధీరుడు కేసీఆర్.

8. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ లాంటి భారీ ప్రాజెక్ట్లులు అల్లుడు హరీష్, కొడుకు కేటీఆర్ లకు పర్యవేక్షణ అప్పజెప్పి ఆర్థిక అరాచకత్వాలకు పాల్పడమని  కేసీఆర్ ప్రోత్సహించిన నేర్పరి కేసీఆర్.

9. పదేండ్ల పాలనలో ప్రజలకు దర్శనమియ్యని కేసీఆర్​. ప్రజా దర్బార్​ పట్టని  ముఖ్యమంత్రిగా  ప్రగతి భవన్​, ఫాంహౌసే పసందుగా గడిపిండు.

10. ధరణి పేరిట తెలంగాణ సార్వత్రిక పోరాటంలో నక్సల్స్ పేదలకు దొరల భూములను  పంచిపెట్టిన వాటిని తిరిగి తెచ్చుకునేందుకు వెలమ సామాజిక వర్గానికి వందల ఎకరాల భూములను తిరిగి కట్టబెట్టేందుకు  పన్నిన పన్నాగం ధరణి, దీంతో దొరలకు కోట్ల విలువ చేసి భూమి వారి దరి చేరింది.

పది సంవత్సరాల కేసీఆర్ పాలన కాలంలో పాల్పడ్డ పది మోసాలను విశ్లేషించి చూస్తే ప్రజలు పన్నుల ద్వారా  వచ్చిన రాబడిని సహజ సంపదలను చిన్న సంఖ్యలో ఉన్న సామాజిక వర్గం కొల్లగొట్టింది. మొత్తానికి మొత్తంగా తెలంగాణ మిగులు రాష్ట్రాన్ని కోలుకోలేని అప్పుల కుప్పగా మార్చిన ఘనుడు కేసీఆర్.సంక్షేమ ముసుగులో తమ వర్గం క్షేమాన్ని  కేసీఆర్ ఆకాంక్షించాడు.ఏదీఏమైనా ఆరవై ఏండ్ల ఆంధ్రపాలన ఒకేత్తయితే తెలంగాణ అంతటా కేసీఆర్ పరివార పాలన మరో ఎత్తు. ఇక ఇప్పుడు కేసీఆర్  ఒకవైపు కేటీఆర్ మరోవైపు హరీశ్​రావు మూడోవైపు అబద్దాలు ప్రచారం చేసుకుంటూ  లోపాయికారిగా బీజేపీతో కుమ్మక్కై ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుల ఇండ్లపై  దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య బంధం తెలంగాణ ప్రజలకు బహిర్గతమైంది.  ఉత్తర తెలంగాణ సమాజం గతంలో ఎదుర్కొన్న ఈ దొరల అణచివేతను, దౌర్జన్యాలనుమానభంగాలకు పాల్పడిన వర్గం తిరిగి బీఆర్ఎస్ కొత్త రూపంలో వచ్చిన వాళ్లను ఇంకా నమ్ముతారాని అనుకుంటున్నారు. కానీ, దక్షిణ తెలంగాణనే కాదు. ఉత్తర తెలంగాణ ప్రజలు సరైన మోకా కోసం ఎదురు చూస్తున్నారు.ఈ ఎన్నికల్లో  కర్రు కాల్చి వాత పెట్టడం తథ్యం.

- జూకంటి జగన్నాథం,కవి, రచయిత.