తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 31 వరకు ఇంటర్ అడ్మిషన్లు

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 31 వరకు ఇంటర్ అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ నెల 15తో అడ్మిషన్ గడువు ముగియనుండగా దాన్ని 31 వరకూ పొడిగిస్తూ ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. 

ఇప్పటి వరకూ ఫస్టియర్​లో 3.81 లక్షల అడ్మిషన్లు జరగ్గా, వీటిలో సర్కారు కాలేజీల్లో 95 వేల మంది చేరారు. అడ్మిషన్ల ప్రక్రియలో తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలు చేయాలని, అడ్మిషన్ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి యాంటీ డ్రగ్ డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు.