
- ఈ సీజన్ నుంచే అమలు చేసేందుకు ఇరిగేషన్ శాఖ కసరత్తు
హైదరాబాద్, వెలుగు: నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద నియంత్రణ, నిర్వహణ, ముంపు నివారణకు ఇరిగేషన్ శాఖ కసరత్తు చేస్తున్నది. ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఎస్)ను వచ్చే వానా కాలం నుంచి అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు సోమవారం జలసౌధలో స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీ సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు. గోదావరి, కృష్ణా బేసిన్ రాష్ట్రాల అధికారులతో ఐఎఫ్ఎంఎస్ అమలుపై చర్చించారు. రెండు బేసిన్లలోని ప్రధాన ప్రాజెక్టులు, క్యాచ్మెంట్ ఏరియాలు, గేజ్ పాయింట్ల ఆధారంగా ఐఎఫ్ఎంఎస్ను రూపొందిం చారు.
వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ల ఆధారంగా వర ద నిర్వహణను చేపట్టనున్నారు. ఎక్కడ.. ఏ రోజు.. ఎంత వర్షపాతం నమోదవుతుంది? ఏ క్యాచిమెంట్ ఏరియా నుంచి, ఏ ప్రాజెక్టుకు ఎంత వరద వస్తుంది? అనే వివరాలను రియల్ టైమ్‌లో తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. దీంతో ఎగువ నుంచి వరదను అంచనా వేసి ప్రాజెక్టుల నుంచి దిగువకు ఎప్పుడు.. ఎంత.. వరదను విడుదల చేయాలన్న దానిపై అంచ నాకు వస్తారు. ఈఎన్సీ అనిల్ కుమార్ ప్రత్యేక చొర వ తీసుకుని ఈ ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌ను రూపకల్పన చేయిం చారు.
కాగా, ప్రతి 2 నుంచి 7 రోజులకోసారి అడ్వాన్స్గానే వరద తీవ్రతను దీని ద్వారా అంచనా వేసేందుకు వీలవుతుందని అధికారులు చెప్తున్నారు. రియల్‌టైం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్‌తో ముంపు ప్రాంతాలను గు ర్తించొచ్చని, మేఘాల తీరు, ఉష్ణోగ్రతల వివరాలను రియల్ టైంలో అంచనా వేసి భారీ వర్షాలు, వరద ముప్పును పసిగట్టేందుకు వీలవుతుందని చెప్తున్నారు. నదీ పరీవాహకంలోని వివిధ ప్రాంతాల ఆధారంగా హెచ్చరికలు ఇవ్వొచ్చని చెప్తున్నారు.