కవులు, కళాకారులకు తెలంగాణ పుట్టినిల్లు ..అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

కవులు, కళాకారులకు తెలంగాణ పుట్టినిల్లు ..అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు: తెలంగాణ.. కవులు, కళాకారులు, రచయితలకు పుట్టినిల్లని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దాశరథి, సినారె జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కవి, రచయిత దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రపంచానికి తెలంగాణ గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటారని కొరనియాడారు. 

1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం ఆయన కవితా ప్రతిభకు నిదర్శనమన్నారు. దాశరథిని గౌరవిస్తూ సాహిత్య రంగంలో కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారాలు ఇస్తోందని తెలిపారు. సినారె కవి, సాహితీవేత్త, రచయితగా రాణించారని, జ్ఞానపీఠ్ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, నంది పురస్కారంతోపాటు ఎన్నో అవార్డులు, రివార్డులు, గౌరవ డాక్టరేట్లు ఆయనను వరించాయన్నారు. 

అంతకుముందు పట్టణంలోని విద్యానగర్ లో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. మర్పల్లి మార్కెట్​కమిటీ చైర్మన్​ మహేందర్​రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​ కిషన్​ నాయక్​, నాయకులు చీమల్​దరి నరోత్తమ్​రెడ్డి, నర్సింహులు గుప్తా, సుధాకర్​రెడ్డి, చిగుర్లపల్లి రమేశ్, కవి దోరవేటి చెన్నయ్య పాల్గొన్నారు.