మూడు నెలల్లో కొత్త పార్టీ పెడతా..మంచి ముహూర్తం కోసం చూస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటు కోసం ప్రాసెస్ జరుగుతుందన్నారు.
ఇవాళ ఫిబ్రవరి 6న మీడియాతో మాట్లాడిన కవిత.. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో హరీశ్ లాయర్ పిటిషన్ వేయించారని చెప్పారు. బీసీ కోటా వ్యతిరేకించిన వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని చెప్పారు. బీసీ కోటా వ్యతిరేక పిటిషన్ వెనుక బీఆర్ఎస్ ఉందన్నారు. జనగణనలో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పారన్నారు. ఉద్యమ కారుల పక్షాణ జాగృతి నిలబడి ఉంటుందన్నారు.
ఇటీవల బీఆర్ఎస్ టార్గెట్ గా కవిత విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..పదే పదే హరీశ్ రావుపై నేరుగా విమర్శలు చేస్తోన్న కవిత..ఇవాళ మరోసారి హరీశ్ ను ఉద్దేశించి విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై హరీశ్ లాయర్ వ్యతిరేక పిటిషన్ వేయించారని చెప్పారు.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతాడనీ అనుకోవడం లేదన్నారు కవిత. సీనియర్ నాయకుడు, విలువలు కలిగిన మంచి వ్యక్తి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఆ పార్టీకి మైనస్ అవుతుందన్నారు. జీవన్ రెడ్డి BRS కు టచ్ లో ఉండొచ్చన్నారు కవిత.
