సింగరేణి కార్యాలయం ముట్టడి.. లక్డీకపూల్ లో కవిత అరెస్ట్

సింగరేణి కార్యాలయం ముట్టడి.. లక్డీకపూల్ లో కవిత అరెస్ట్

 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ హైదరాబాద్  లక్డీకపూల్ లోని సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచారు కవిత. ఈ క్రమంలో నవంబర్ 19న  సింగరేణి భవన్ ముట్టడిలో పాల్గొన్న కవిత రోడ్డుపై బైఠాయించారు . సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో  కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్ కు తరsలించారు.

 డిసెంబర్  13న సీఎండీ కార్యాలయం ముట్టడి

డిసెంబర్  13న సింగరేణి  సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నామని  ఇప్పటికే  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు.  రెండేళ్లుగా మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతున్నామని చెప్పారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి  ఇన్సూరెన్స్ లాంటిదన్నారు.  డిపెండెంట్ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తామన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఇప్పుడు ఉన్నామన్నారు కవిత.