లాయర్ల సంక్షేమానికి రూ.100 కోట్లు ఇవ్వాలి

లాయర్ల సంక్షేమానికి రూ.100 కోట్లు ఇవ్వాలి
  •     తెలంగాణ న్యాయవాదుల సురక్ష సమితి డిమాండ్

ముషీరాబాద్, వెలుగు :  తమ సమస్యలను పరిష్కరించి, ఏటా న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించాలని తెలంగాణ న్యాయవాదుల సురక్ష సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని నినాదాలు చేశారు. సమితి అధ్యక్షులు అశోక్ కుమార్, సత్యనారాయణ, హమాద్

రాకేశ్​కులకర్ణి మాట్లాడుతూ.. న్యాయవాదులు వృత్తి రీత్యా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని, 41 ఏ సీఆర్పీసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ అడ్వకేట్లకు రూ.5వేల స్టైఫండ్ ఇవ్వాలని, అర్హులైన న్యాయవాదులకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.