లెక్చరర్స్కు హెల్త్ కార్డులు ఇయ్యాలి.. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం డిమాండ్

లెక్చరర్స్కు హెల్త్ కార్డులు ఇయ్యాలి.. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకులకు ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం డిమాండ్ చేసింది. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నూతన సంవత్సర క్యాలెండర్, ఫోరం రాష్ట్ర కార్యదర్శి పి. అరుణ్ రచించిన ‘శూన్యం బిగ్ బ్యాంగ్’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథులుగా బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఫోరం రాష్ట్ర చైర్మన్ కత్తి వెంకటస్వామి హాజరై మాట్లాడారు.

రాష్ట్రంలోని అధ్యాపకులకు 12 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వెంటనే చెల్లించాలని, ఆరోగ్య భద్రత కార్డులు, ఇతర సౌకర్యాలపై జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫోరం అధ్యక్షుడు రామకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి వేణు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు, తిరుపతి, రవి, కురుమూర్తి, మార్కండేయ తదితరులు హాజరయ్యారు.