
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ భాషా, సాహిత్యాల సౌందర్యం అత్యంత గొప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో మండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ జలంధర్ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణ భాష- సమగ్ర పరిశీలన పుస్తకావిష్కరణ సభ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగింది.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పుస్తకాన్ని మొదటి పుస్తకాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. వెయ్యేండ్ల తెలంగాణ సాహిత్యంలో ఆనాటి పాల్కురికి మొదలు నేటి ఆధునిక కవుల వరకు ఎంతోమంది సాహితీవేత్తలు భాషా సాహిత్యాలను సుసంపన్నం చేస్తూ వచ్చారన్నారు. జలంధర్ రెడ్డి చేస్తున్న సాహిత్య సేవ గొప్పదని కొనియాడారు.