V6 News

రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

 రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇటీవలే కేసులు వేయికి చేరుకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తాజాగా.. 500లోపే పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. నమోదైన కేసుల్లో హైదరాబాద్ లోనే అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా... గత 24 గంటల్లో 406 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఒక్కరోజులో 494 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8, 22, 667 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.13 శాతంగా ఉందని, మొత్తం 27 వేల 348 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది. 

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : ఆదిలాబాద్ 01. భద్రాద్రి కొత్తగూడెం 03, హైదరాబాద్ లో 177, జగిత్యాల 05, జనగాం 05, జయశంకర్ భూపాలపల్లి 02. జోగులాంబ గద్వాల 02, కామారెడ్డి 06, కరీంనగర్ 11, ఖమ్మం 10, కొమరంభీం ఆసిఫాబాద్ 02, మహబూబ్ నగర్ 14, మహబూబాబాద్ 02, మంచిర్యాల 06, మెదక్ 09, మేడ్చల్ మల్కాజ్ గిరి 32, ములుగు 00, నాగర్ కర్నూలు 03, నల్గొండ 18, నారాయణపేట 00, నిర్మల్ 00, నిజామాబాద్ 08, పెద్దపల్లి 13, రాజన్న సిరిసిల్ల 07, రంగారెడ్డి 27, సంగారెడ్డి 05, సిద్ధిపేట 06, సూర్యాపేట 05, వికారాబాద్ 02, వనపర్తి 01, వరంగల్ రూరల్ 03, హన్మకొండ 05, యాదాద్రి భువనగరి 16. మొత్తం - 406