తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగటం భయాందోళనలకు గురిచేసింది. 2026 ఏప్రిల్ 25 సాయంత్రం కారులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై దిగిపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సడెన్ గా అంటుకున్న మంటలు క్షణాల్లోనే కారు మొత్తం వ్యాపించాయి. సమీపంలో పెట్రోల్ పంపు ఉండడంతో బంకుకు మంటలు అంటుకుంటాయేమోనని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బంక్ లో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే కారు దాదాపు కాలిపోయింది. నడి రోడ్డుపై కారు తగలబడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

