కాంట్రాక్ట్​ అసిస్టెంట్ ప్రొఫెసర్లుపెన్ డౌన్

కాంట్రాక్ట్​ అసిస్టెంట్ ప్రొఫెసర్లుపెన్ డౌన్

బషీర్​బాగ్, వెలుగు :  తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు.  గురువారం వర్సిటీలో పెన్​డౌన్ చేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 వర్సిటీల్లో 1,400 మంది కాంట్రాక్ట్​ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం  కేసీఆర్ కాంట్రాక్ట్​ వ్యవస్థ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

తాము 30 ఏండ్లుగా టీచింగ్ చేస్తూ ఎంతో మంది స్టూడెంట్లకు విద్యను అందిస్తున్నామని అయినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తాము విధులను బహిష్కరించి పెన్​డౌన్ చేసినా ప్రభుత్వం దిగి రాకపోవడం దారుణమన్నారు. తక్షణమే తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే వర్సిటీల్లో విద్యను స్తంభింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.  ఆందోళనలో కాంట్రాక్ట్​ అసిస్టెంట్ ప్రొఫె
సర్స్  నరసింహారావు ,  యాదయ్య ,  శేఖర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.