హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి షెడ్యూల్ రిలీజ్ చేశారు.
కాగా, ఈ ఏడాది నుంచి మోడల్ స్కూల్స్‌లో ఇప్పటి వరకు ఉన్న ఎంఈసీ గ్రూపును తొలగించి, దాని స్థానంలో ఏసీఈ గ్రూపును కొత్తగా ప్రవేశపెట్టారు. ఎంపీసీ, బైపీసీ, ఏసీఈ, సీఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా https://tgms.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. స్కూల్ వారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మే 27న సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు. ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మే 28 నుంచి 30 వరకు జరుగుతుంది.
