సాధారణ వ్యక్తులే నాయకులై..

సాధారణ వ్యక్తులే నాయకులై..

తెలంగాణ ఉద్యమంలో నాయకత్వ స్వభావం మారిపోయింది, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా ఎక్కడ చూసినా సాధారణ ప్రజలే నాయకులు. డబ్బు, పలుకుబడిగల నాయకుల కోసం , సమ్మోహన శక్తి గల వ్యక్తుల కోసం ప్రజలు దేవులాడ లేదు. ఉద్యమం కోసం సమయాన్నిచ్చి, నిబద్ధతతో, నిజాయితీగా పనిచేయగల వ్యక్తులనే ప్రజలు నాయకులుగా ఎంచుకున్నారు. తాము నిర్మించుకున్న ఉద్యమ వేదికల దగ్గరికి.. స్వార్థపరులను రానివ్వలేదు. ఏ వాసనా లేని గునుగుపువ్వుతో బతుకమ్మను పేర్చినట్టు... తెలంగాణ సమాజం నిబద్ధతనే ప్రమాణంగా ఎంచుకొని సాధారణ ప్రజలను నాయకులుగా మలుచుకున్నది. ఉద్యమం అనేకమంది నాయకులను సృష్టించింది.