రాష్ట్రానికి మరో 7 అవార్డులు రావడం సంతోషంగా ఉంది: కేటీఆర్

రాష్ట్రానికి మరో 7 అవార్డులు రావడం సంతోషంగా ఉంది: కేటీఆర్

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్కు  మరో 7 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని  మంత్రి  కేటీఆర్ అన్నారు.  ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో  అవార్డుల సంఖ్య 26కు చేరుకుందని తెలిపారు. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన రాష్ట్రం తెలంగాణనే అని వెల్లడించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాగజ్ నగర్, జనగాం, అమన్ గల్, గుండ్లపోచంపల్లి, కొత్తకోట, వర్ధన్నపేట మున్సిపాల్టీలకు అవార్డులు వచ్చినట్టుగా మంత్రి వివరించారు. 

స్వచ్ఛసర్వేక్షణ్‌ 2.0 పేరుతో ప్రకటించిన తాజా అవార్డుల్లో రాష్ట్రంలోని ఈ ఏడు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న నగరాల విభాగంలో వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అవార్డును కైవసం చేసుకున్నది.  జాతీయస్థాయిలో జీడబ్ల్యూఎంసీ (GWMC)మూడోస్థానంలో నిలిచింది.