అసెంబ్లీలో మున్సిపాలిటీ బిల్లు పాస్

అసెంబ్లీలో మున్సిపాలిటీ బిల్లు పాస్

రాష్ట్ర అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టం బిల్లు పాస్ అయింది. సవరణలను స్పీకర్ మూజువాణి ఓటుతో ఆమోదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ప్రవేశపెట్టిన ఈ బిల్లును టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు.

రాష్ట్రంలో మున్సిపాలిటీల పనితీరు దుర్మార్గంగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. భయం.. భక్తి.. ఈ రెండే వ్యవస్థలను నడుపుతున్నాయని చెప్పారు. పద్ధతిగా, వినయంగా చెబితే ఎవరూ వినే పరిస్థితి లేదని.. అందుకే.. భారీ జరిమానాలతో… కఠిన చర్యలతో బిల్లును రూపొందించామన్నారు.