హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ రిలీజైంది. ఏప్రిల్ 20 నుంచి 27 వరకూ థియరీ పరీక్షలు ఉంటాయని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఆ తర్వాత ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
ఈ పరీక్షలకు మొత్తం 99,995 మంది హాజరుకానున్నారని చెప్పారు. దీంట్లో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ను 40,643 మంది, ఇంటర్మీడియేట్ పరీక్షలను 59,352 మంది రాయనున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎగ్జామ్ టేబుల్ కోసం విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
