క్లైమాక్స్కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సిట్ నోటీసులు

క్లైమాక్స్కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. కేంద్ర మంత్రి బండి సంజయ్కి సిట్ నోటీసులు

కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు జులై 24న తమ ఎదుట హాజరు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కి సిట్ నోటీసులు పంపించింది. తనకొచ్చిన నోటీసును లవ్ లెటర్గా పేర్కొంటూ ఫన్నీ ప్రెస్ నోట్ను ఆయన రిలీజ్ చేశారు. కేసీఆర్ చేసిన లుచ్చా పనుల ఫలితమే ఈ లవ్ లెటర్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన లుచ్చా పనుల ఫలితంగానే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుంచి ఈ లవ్ లెటర్ (నోటీసులు) అందుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచుడు కేసీఆర్ అని బండి సంజయ్ మండిపడ్డారు. భార్యాభర్తలు పడక గదిలో మాట్లాడుకునే మాటలను కూడా ట్యాప్ చేసి ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన దుర్మార్గ కుటుంబం కేసీఆర్దేనని ఆయన విమర్శించారు.

సిట్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తనకు తెలిసిన, తన దగ్గరున్న సమాచారాన్ని పోలీసులకు అందజేస్తానని సిట్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. బండి సంజయ్కు సిట్ తాజా నోటీసులతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం  క్లైమాక్స్కు చేరినట్టే అనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తొలిసారి తెరపైకి తీసుకొచ్చింది బండి సంజయ్ కావడం గమనార్హం. కేంద్ర మంత్రితో పాటు ఆయన పీఆర్వో, పీఏలకూ కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌజ్లో స్టేట్మెంట్ ఇచ్చేందుకు బండి సంజయ్ అంగీకరించారు. అదే రోజు ఆయన పీఆర్వో, పీఏల స్టేట్మెంట్ను సిట్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్లి సిట్ అధికారులు నేరుగా నోటీసులు ఇచ్చారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్కు చేరిందని ఈ పరిణామంతో స్పష్టమైంది. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం (సిట్) అధికారులు ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, ప్రముఖులను విచారణకు పిలిచి స్టేట్ రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్తో పాటు ఆయన పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతికి కూడా నోటీసులు అందజేసింది. ఈనెల 24న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నందున ఆయన వద్దకే వచ్చి స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా బండి సంజయ్ సూచన  మేరకు హైదరాబాద్ లోని దిల్ కుష్ ప్రభుత్వ అతిథి గ్రుహంలో విచారణ జరపాలని పోలీసులు నిర్ణయించారు. బండి సంజయ్ తోపాటు పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతి స్టేట్ మెంట్లను కూడా రికార్డు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వీరంతా అదే రోజు విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు కొద్దిరోజుల క్రితమే బండి సంజయ్ వ్యక్తిగత డ్రైవర్ రమేశ్ ను సిట్ పోలీసులు విచారణకు పిలిచి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న సంగతి విదితమే.