
తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్ తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎంపిక చేసింది. సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు అక్టోబర్ 5 ఉదయం నుంచి https:// www.tslprb.in/ సైట్లో అందుబాటులో ఉంటాయని TSLPRB వెల్లడించింది.