రూ.10కోట్ల సొత్తు సీజ్ … ఎన్నికలవేళ పోలీస్ నిఘా

రూ.10కోట్ల సొత్తు సీజ్ … ఎన్నికలవేళ పోలీస్ నిఘా

ఏప్రిల్ 11న రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు భధ్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తోంది తెలంగాణ పోలీస్ డిపార్టుమెంట్. ఈ ఏర్పాట్లను లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ .. డీజీపీ కార్యాలయంలో వివరించారు. మొత్తం పోలింగ్ స్టేషన్లు, బెటాలియన్లు, తనిఖీల వివరాలు, సీజ్ చేసిన సొమ్ము గురించి చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 34, 667

సాధారణ పోలింగ్ స్టేషన్లు 28, 273

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 6,394

ఎన్నికల బందోబస్తు లో మొత్తం తెలంగాణ పోలీసులు 48 వేల 58 సిబ్బంది

రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్లైయింగ్ స్కాడ్

3451 మొబైల్ పార్టీలు

సెంట్రల్ ఫోర్స్ మొత్తం 145 బెటాలియన్స్

ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సెంట్రల్ ఫోర్స్ 75 బెటాలియన్స్

లోక్ సభ ఎన్నికల సందర్బంగా పోలీసులు డబ్బు,లిక్కర్ తరలింపుపై పోలీస్ శాఖ దృష్టిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు వేగవంతం చేస్తోంది.

ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు రూ.7 కోట్ల 22 లక్షల 75 వేల 156.

సీజ్ చేసి లిక్కర్ 14 వేల 734 లీటర్లు… రూ.46 లక్షల విలువైనది

సీజ్ చేసిన గోల్డ్, సిల్వర్, గంజా, గుట్కా విలువ.. రూ.2 కోట్ల 20 లక్షల 76 వేల 840

ఎన్నికల కోడ్ సందర్బంగా…. 8 వేల 153 ఆయుధాలు డిపాజిట్  అయినట్టుగా పోలీసులు వివరించారు.

19 వేల 138 మంది బైండోవర్

2 వేల 540 నాన్ బెయిలబుల్ వారంట్ లు అమలు

195 మందిపై ఎస్సీ, ఎస్టీ, ఐపీసీతోపాటు ఎంసీసీ కేసులు బుక్

లైసెన్స్ లేని 2 వెపన్స్  సీజ్

రూల్స్ బ్రేక్ చేయడంతో 32 లైసెన్సుడ్ వెపన్స్ రద్దు

33 జిల్లాల్లో రోడ్డు మర్గాలలో చెక్ పోస్టులు

సిటీలో రాత్రి పగలు తనీఖీలు