ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయాలి..ప్రభుత్వానికి జేఏసీ నేతల విన్నపం

ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయాలి..ప్రభుత్వానికి జేఏసీ నేతల విన్నపం

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సాధారణ బదిలీలను మే లేదా జూన్ నెలలకు వాయి దా వేయాలని స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం జేఏసీ నేతలు సాయిబాబు, శ్రీధర్, బీసీ రెడ్డి, సదానందం స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎనర్జీ) నవీన్ మిట్టల్‌‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. సదరన్, నార్తర్న్ డిస్కంలలో జనవరి నెలలో బదిలీలు చేపట్టవద్దని కోరారు. జేఏసీ సమా వేశం డిసెంబర్ 29న జరగగా అన్ని యూనియన్లు, అసోసియేషన్లు పాల్గొని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. 

విద్యా సంవత్సరం మధ్యలో ఉద్యోగులను బదిలీలు చేయడంతో పిల్లల చదువుకు ఇబ్బంది కలుగుతుందని, అందుకే సాధారణ బదిలీలను మే/జూన్ నెలల్లోనే చేపట్టాలని నేతలు తెలిపారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయించేందుకు జేఏసీ నేతలు స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌‌తో పాటు సీఎండీలు ముషారఫ్, వరుణ్ రెడ్డిలను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం తమ వినతులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం, యాజమాన్యాలను కోరారు.