ఇయ్యాల (ఆగస్టు 17 )నుంచి మండలాల్లో ప్రజావాణి...ప్రతీ సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహణ

ఇయ్యాల (ఆగస్టు 17 )నుంచి మండలాల్లో ప్రజావాణి...ప్రతీ సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండలాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం షురూ కానున్నది. ప్రతీ సోమవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంపీడీవో నోడల్ ఆఫీసర్‌‌‌‌గా వ్యవహరిస్తూ ఈ ఫిర్యాదుల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మండల స్థాయి అధికారులంతా నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. 

అయితే, అధికారులు, బాధితుల నుంచి తీసుకున్న ప్రతీ దరఖాస్తును ప్రజావాణి పోర్టల్ (prajavani.cgg.gov.in) లో నమోదు చేసి, దరఖాస్తుదారుడికి ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ రశీదును ఇవ్వాల్సి ఉంటుంది. పోర్టల్ నిర్వహణలో సిబ్బందికి ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా తక్షణ పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా హెల్ప్ డెస్క్ అసిస్టెంట్లను నియమించింది.