తెలంగాణకు అతి భారీ వర్ష సూచన....ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...

 తెలంగాణకు అతి భారీ వర్ష సూచన....ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని  వాతావరణ కేంద్రం ప్రకటించింది. జులై 26వ తేదీ బుధవారంతో పాటు జులై 27, జులై 28వ తేదీ వరకు విస్తారంగా వానలు పడతాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల కదలిక తెలంగాణపై ఉదృతంగా ఉండడం..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ...తీవ్ర అల్పపీడనంగా మారడంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.  ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

 రాష్ట్రంలో ఏడో జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో  అక్కడక్కడ అతి భారీ నుంచి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ALSO READ :కొల్లాపూర్ సభలో మహిళా డిక్లరేషన్: జూపల్లి 

రాష్ట్రంలో జులై 26వ తేదీ బుధవారం  అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇటు హైదరాబాద్ లోనూ జులై 26వ తేదీ బుధవారం  తేలికపాటి జల్లులతో పాటు మోస్తారు వర్షం పడుతుందని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.