హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో పనిచేస్తున్న పీడీలు, పీఈటీలకు స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) వింగ్‌లో ఓడీ ప్రాతిపదికన పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం తెలిపారు.
ఈ నెల 12 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ వర్డ్, స్ప్రెడ్ షీట్లు, ప్రెజంటేషన్లు, ఆన్‌లైన్ అప్లికేషన్లపై కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సూచించారు.
