హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ బలోపేతం, సమగ్ర శిక్షా స్కీముల అమలుపై సమీక్షించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ శనివారం రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ ది ప్లాజాలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో సర్కారు బడుల్లో నాణ్యమైన బోధన, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో అమలవుతున్న అకడమిక్ ప్రాజెక్టులు, ఎఫ్‌ఎల్‌ఎన్, ఒకేషనల్ కోర్సులుతదితర అంశాలపై డీఈవోలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సమగ్రంగా సమీక్షించనున్నారు.
