50 వేల పెన్షనర్లకు హెల్త్ కార్డులు..మూడు జిల్లాల్లో త్వరలో పంపిణీ

50 వేల పెన్షనర్లకు హెల్త్ కార్డులు..మూడు జిల్లాల్లో  త్వరలో పంపిణీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు నేషనల్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఎన్ఈహెచ్​ఎస్) ట్రస్ట్ సీఈఓ హన్మంత్ వెల్లడించారు. మంగళవారం బడీచౌడి పెన్షన్ ఆఫీస్‌‌‌‌ను ఆయన సందర్శించి హెల్త్ కార్డుల డౌన్‌‌‌‌లోడ్, అప్‌‌‌‌లోడ్ ప్రక్రియ పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఈ మూడు జిల్లాల పరిధిలో దాదాపు 90 వేల మంది పెన్షనర్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 40 వేల మంది మాత్రమే హెల్త్ కార్డులు పొందారు. 

ఇంకా 50వేల మంది పెన్షనర్లు కార్డులు పొందవలసి ఉంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారందరికీ త్వరగా కార్డులు అందించేందుకు బడీచౌడి పెన్షన్ ఆఫీసులో ఫైనాన్స్, ట్రెజరీ ఐఎఫ్‌‌‌‌ఎంఎస్, హెల్త్ టెక్నికల్ టీమ్ సంయుక్తంగా అప్‌‌‌‌లోడ్, డౌన్‌‌‌‌లోడ్ ప్రక్రియను నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ సీఈఓ హన్మంత్ చేతుల మీదుగా దాదాపు 500 మంది పెన్షనర్లకు హెల్త్ కార్డులను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. వెంకట్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు టి రంగయ్య, ప్రధాన కార్యదర్శి కె. వెంకయ్య, ఫైనాన్స్ సెక్రటరీ ప్రహ్లాద్ రావు, వెంకట్ రెడ్డి, లక్ష్మీనర్సింహారావు, శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.