- ఫస్ట్ స్పెల్ రిజల్ట్ వెబ్‌సైట్‌లో పెట్టిన ఎస్‌ఎస్‌సీ బోర్డు
- స్కూళ్ల లాగిన్లలో మార్కుల మెమోలు
హైదరాబాద్, వెలుగు: మార్చిలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన రీ-వెరిఫికేషన్ ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం రిలీజ్చేసింది. ఫస్ట్ స్పెల్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆ విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాల స్టేటస్‌ను చూసుకోవాలని సూచించారు. ఆ తర్వాత తమ ఫలితాల వివరాలు, ఆన్సర్ స్క్రిప్ట్ ఫొటోస్టాట్ కాపీల కోసం సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్లను సంప్రదించాలని కోరారు.
ఆయా స్కూళ్ల లాగిన్ క్రెడెన్షియల్స్‌లో ఈ ఫలితాలను, జవాబు పత్రాల కాపీలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అయితే, ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులకు రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను రాబోయే స్పెల్స్‌లో దశలవారీగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పదిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల మెమోలను ఆయా స్కూళ్ల లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు పీవీ శ్రీహరి తెలిపారు. విద్యార్థుల పైచదువుల ప్రవేశాల కోసం ఈ మెమోలు ముందస్తుగానే అందుబాటులో ఉంచామన్నారు. ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ ద్వారా ఈ మెమోలను డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలలన్నారు.
