- సత్తాచాటిన కేజీబీవీ, ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్లు
నెట్వర్క్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఫలితాల్లో రాష్ట్రంలో నిర్మల్ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 98.96 శాతం ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 9743 మంది స్టూడెంట్లు పరీక్షలు రాయగా 9642 మంది పాసయ్యారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 168 ప్రభుత్వ స్కూళ్లలోని 6603 మంది పరీక్షలు రాయగా 6510 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాను మూడో స్థానంలో నిలిపిన డీఈవో భోజన్నతో పాటు పరీక్షల నిర్వహణ అధికారి ముడారపు పరమేశ్వర్ ఇతర అధికారులను కలెక్టర్ భవేశ్ మిశ్రా అభినందించారు. విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి స్వీట్లు తినిపించారు. జగిత్యాల జిల్లాలో 12,687 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 12,544 మంది(98.87శాతం) పాసయ్యారు.
అత్యధిక పాస్ పర్సెంటేజీ లో జగిత్యాల జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లాలో 13,137 మంది హాజరు కాగా 12,949 మంది(98.57) పాస్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7,310 మంది పరీక్ష రాయగా, 7,145 మంది(97.74) ఉత్తీర్ణులయ్యారు. పెద్దపల్లి జిల్లాలో 7,488 మంది పరీక్ష రాయగా 7,316 మంది(97.70 శాతం) పాస్ అయ్యారు. బాయ్స్ తో పోలిస్తే.. గర్ల్స్ పాస్ పర్సెంటేజీ ఎక్కువగా నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా స్టూడెంట్లు 94.16 శాతం ఉత్తీర్ణత సాధించారు.
దీంతో ర్యాంకింగ్లో జిల్లా మెరుగైంది. గతేడాది 32వ స్థానంలో ఉన్న జిల్లా ఈసారి 28వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 6,932 మంది విద్యార్థులకు గాను 6,527 మంది పాస్ అయ్యారు. బాలురు 91.78 శాతం, బాలికలు 96.21 శాతం ఉత్తీర్ణత సాధించారు.నిజామాబాద్జిల్లా 94.24 శాతం ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 24,365 మంది స్టూడెంట్స్ఎగ్జామ్రాయగా 22,961 మంది పాస్అయ్యారు. గవర్నమెంట్బడుల్లో చదివిన 16 మంది స్టూడెంట్స్575కు పైగా మార్కులు సాధించి రికార్డ్సృష్టించారు.
ప్రభుత్వ స్కూళ్లలో 100% పాస్
టెన్త్ఫలితాల్లో గురుకులాలు, కేజీబీవీ, ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్లు సత్తా చాటారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించింది. జాదవ్ అమిత 572, ఆడే వైష్ణవి 566, ఆడే సంధ్య 566 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని హైస్కూల్స్టూడెంట్ రంగసాయి జస్విత్ 566 మార్కులతో మండల టాపర్ గా నిలిచాడు. ఇదే స్కూల్ విద్యార్థిని వెన్నం అనుశ్రీ 559 మార్కులు తెచ్చుకుంది. నస్పూర్ లోని కేజీబీవీ స్టూడెంట్లు సహస్ర, మధుప్రియ 551మార్కులు తెచ్చుకున్నారు. 13 మంది స్టూడెంట్లు 500లకు పైగా మార్కులు సాధించారని ఎస్వో మౌనిక తెలిపారు.

