రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ

రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మంగళవారం రోజున రాష్ట్ర బంద్ చేయాలని పిలుపునిచ్చారు రెవెన్యూ ఉద్యోగులు. సోమవారం మధ్యాహ్నం తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి ఓ దుండగుడు నిప్పంటించి సజీవ దహనం చేసిన ఘటన అత్యంత దారుణమని అన్నారు. ఈ ఘటనతో ఉద్యోగులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని, హైదరాబాద్-విజయవాడ హైవేపై ధర్నాచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఆమె మృతికి సంతాపంగా రేపు (మంగళవారం) రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చారు రెవెన్యూ ఉద్యోగులు.

రక్షణ కల్పించాలి

రోడ్డుపై బైఠాయించిన రెవెన్యూ ఉద్యోగులు

భూరికార్డుల ప్రక్షాళనతోనే తమపై దాడులు జరుగుతున్నాయన్నారు రెవెన్యూ ఉద్యోగులు. తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, అయినా సర్కారు పట్టించుకోవడం లేదని అన్నారు. ధరణి వెబ్ సైట్ లో చాలా సమస్యలున్నాయని.. అందువల్లే పనిలో చాలా ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఉన్నతాధికారులకు చెప్పినా… సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించారు.