టీఎస్​పీఎస్సీ హెల్ప్ లైన్ నంబర్లు పనిచేస్తలే

టీఎస్​పీఎస్సీ హెల్ప్ లైన్ నంబర్లు పనిచేస్తలే
  •         మూడు రోజులుగా ఇదే పరిస్థితి
  •         సమాచారం కోసం అభ్యర్థుల తిప్పలు

 హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్​ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) హెల్ప్ లైన్ నంబర్లు పనిచేయడం లేదు. మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొత్త కమిషన్ యాక్టివ్ కావడంతో పలు రిక్రూట్మెంట్ల ప్రాసెస్ ​వేగవంతమైంది. ఈ క్రమంలో ఫోన్ నంబర్లు పనిచేయకపోవడంతో దూర ప్రాంతాల్లోని అభ్యర్థుల సందేహాలు తీర్చే వారు కరువయ్యారు.

టీఎస్​పీఎస్సీ ఆఫీసులోకి అభ్యర్థులకు ఎంట్రీ  లేదు. ప్రత్యేకమైన సమస్యలున్నవారిని మాత్రమే అనుమతిస్తారు. ఏదైనా సమాచారం కావాలంటే కమిషన్ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి తెలుసుకుంటున్నారు. అయితే, గత మూడు రోజులుగా కమిషన్ కాల్ సెంటర్ నంబర్లు (040– -22445566 / 040– -24746887) పనిచేయడం లేదు. ప్రస్తుతం గ్రూప్–1 అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు పలు పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీలు, ఫైనల్ కీలను కమిషన్ రిలీజ్ చేసింది.

సెలక్షన్ లిస్టులనూ విడుదల చేసింది. ప్రస్తుతం గ్రూప్–2, 3 ఎగ్జామ్ డేట్లు, ఇతర పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు కమిషన్​ను అడగాలంటే కొంత ఇబ్బందికరంగా మారింది. రెండు నంబర్లు పనిచేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే, బీఎస్ఎన్ఎల్ లైన్ ప్రాబ్లమ్ వల్లనే ఈ సమస్య ఏర్పడిందని కమిషన్ అధికారులు చెప్తున్నారు. రెండు రోజుల్లోనే  సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.