హైదరాబాద్, వెలుగు : విద్యా రంగాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అన్నారు. విద్యా రం గంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆగస్టు1న ‘తెలంగాణ విద్యార్థి కదనభేరి’ పేరుతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ పెడ్తున్నామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో ఏబీవీపీ నాయకులతో కలిసి చలో హైదరాబాద్ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రవణ్, జాయింట్ సెక్రటరీ కమల్ సురేశ్, ఏబీవీపీ సిటీ సెక్రటరీ శ్రీకాంత్, రాష్ట్ర నేతలు శ్రీకాంత్, శ్రీహరి, శ్రీనాథ్, పృథ్వీ పాల్గొన్నారు.

