ఇళ్లలోని కార్పెట్లు, సోఫాలపై పడిన మరకలు, దుమ్ము, అలాగే పెంపుడు జంతువుల కారణంగా వచ్చే దుర్వాసనలను తగ్గించడానికి ఈ క్లీనర్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి లిక్విడ్ క్లీనర్ లేదా పోర్టబుల్ క్లీనింగ్ మెషిన్ రూపంలో లభిస్తాయి. లిక్విడ్ క్లీనర్లలో కొన్ని బయో డీగ్రేడబుల్ క్లీనింగ్ పదార్థాలు ఉంటాయి.
పోర్టబుల్ క్లీనింగ్ మెషిన్లు సాధారణంగా హెవీ -డ్యూటీ ప్లాస్టిక్ బాడీ, ఫైబర్ భాగాలతో తయారవుతాయి. లిక్విడ్ క్లీనర్లు స్ప్రే లేదా ఫోమ్ రూపంలో మరకలను వదిలించడంలో సాయపడతాయి. క్లీనింగ్ మెషిన్లు నీటిని ఒత్తిడితో స్ప్రే చేసి, మురికి నీటిని వాక్యూమ్ ద్వారా పీల్చి శుభ్రపరుస్తాయి.
ఇవి కార్పెట్లు, ఫ్యాబ్రిక్ సోఫాలు, రూఫ్ లైనింగ్, ఫ్లోర్ మ్యాట్స్‌ను క్లీన్ చేయడానికి కూడా పనికొస్తాయి. లిక్విడ్ క్లీనర్ల ధరలు సాధారణంగా రూ.300 నుంచి రూ.600 వరకు ఉంటాయి. పోర్టబుల్ క్లీనింగ్ మెషిన్లు రూ.14,000 నుంచి రూ.19,000 లేదా అంతకంటే ఎక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి.
