కుక్కలు, పిల్లులకు స్నానం చేయించిన తర్వాత వాటి హెయిర్‌ను త్వరగా ఆరబెట్టడానికి పెట్ బ్లోయర్లు, డ్రైయర్ బాక్సులు ఉపయోగపడతాయి. ఏయోలస్ వంటి బ్రాండ్ల బ్లోయర్లు, కోజివావ్ వంటి బ్రాండ్ల ఆటోమేటిక్ డ్రైయర్ బాక్సులు మార్కెట్లో లభిస్తున్నాయి.
బ్లోయర్లు సాధారణంగా మెటల్ షెల్, ఇన్సులేటెడ్ ప్లాస్టిక్ బాడీతో తయారవుతాయి. డ్రైయర్ బాక్సులు ఫుడ్-గ్రేడ్ ఏబీఎస్ ప్లాస్టిక్, టెంపర్డ్ గ్లాస్ విండో వంటి పదార్థాలతో తయారవుతాయి. బ్లోయర్లు ఎక్కువ వేగంతో గాలి ప్రవాహాన్ని అందిస్తూ వెంట్రుకల్లోని తేమను త్వరగా తొలగిస్తాయి.
డ్రైయర్ బాక్సులు 360 డిగ్రీల గాలి ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ఫీచర్లతో పెంపుడు జంతువులను మరింత సౌకర్యవంతంగా ఆరబెట్టేందుకు సాయపడతాయి.
ధర : సుమారు రూ.1,500 నుంచి రూ.7,500 వరకు.
