స్విమ్మర్ వ్రితికి ఐదో గోల్డ్ మెడల్స్‌‌

స్విమ్మర్ వ్రితికి ఐదో గోల్డ్ మెడల్స్‌‌

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ చెన్నైలో బుధవారం ముగిసిన ఖేలో ఇండియా యూత్‌‌ గేమ్స్‌‌లో ఐదు గోల్డ్ మెడల్స్‌‌ కైవసం చేసుకొని ఔరా అనిపించింది. ఇప్పటికే మూడు బంగారు పతకాలు గెలిచిన వ్రితి చివరి రోజు మరో రెండు నెగ్గింది. విమెన్స్‌‌ 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌‌ ఫైనల్లో వ్రితి 17 నిమిషాల 59.51 సెకండ్ల టైమింగ్‌‌తో టాప్ ప్లేస్‌‌ సాధించింది. ఆపై, 200మీ. బటర్‌‌‌‌ ఫై ఫైనల్లో 2 నిమిషాల 22.89 సెకండ్లతో మరో గోల్డ్ నెగ్గింది. దాంతో ఈ టోర్నీలో ఐదు గోల్డ్ మెడల్స్‌‌ గెలిచిన ఏకైక స్విమ్మర్​గా రికార్డు సృష్టించింది. మరోవైపు టెన్నిస్ విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఓడిన లక్ష్మి దండు సిల్వర్ ఖాతాలో వేసుకుంది.