తెలంగాణలో టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి.. జనవరి 3న ప్రారంభమైన టెట్ పరీక్షలు ఇవాళ్టి ( జనవరి 20 ) వరకు జరిగాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు టెట్ కన్వీనర్. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని.. జనవరి 30న టెట్ పేర్క్షలకు సంబందించిన కీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈసారి టెట్ పరీక్షకు మొత్తం 82.09 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రకటించారు టెట్ కన్వీనర్.
టెట్ పేపర్-1, 2లకు కలిపి మొత్తం రెండు లక్షల 38 వేల మంది దరఖాస్తు చేసుకోగా..82.9 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ఈసారి ఇన్ సర్వీసు టీచర్లు 71 వేల 670 మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఈసారి భారీ సంఖ్యలో పోటీ నెలకొంది. టెట్ ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి 16 తేదీల మధ్య విడుదలవుతాయని తెలుస్తోంది.
