ఇవాళ్టి (డిసెంబర్ 27) నుంచి టెట్ హాల్ టికెట్లు..జనవరి 3 నుంచి 20 వరకు ఎగ్జామ్స్

ఇవాళ్టి (డిసెంబర్ 27) నుంచి టెట్ హాల్ టికెట్లు..జనవరి 3 నుంచి 20 వరకు ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్  ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్ టికెట్ల నిరీక్షణకు తెరపడింది. శనివారం ఉదయం 11 గంటల తర్వాత వెబ్‌‌సైట్‌‌లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు స్కూల్ ఎడ్యు కేషన్  అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు schooledu.telangana.gov.in  వెబ్‌‌ సైట్  నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. 

వచ్చే నెల 3 నుం చి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌‌లైన్‌‌లో టెట్  పరీక్షలు జరగనున్నాయి. కాగా.. జనవరి 3, 4, 5, 6, 8,  9, 11, 19, 20వ తేదీల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. రోజూ రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11.30 వర కు, రెండో షిఫ్ట్  మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతుంది. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌‌ను వెబ్‌‌సైట్‌‌లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. టెట్​కు 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దీనిలో పేపర్-2 కు 1,52,216 మంది, పేపర్ 1కు 85,538 మంది దరఖాస్తు చేశారు. అయితే, వీరిలో 71,670 మంది ఇన్-సర్వీస్  టీచర్లు ఉన్నారు.