టెట్ ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల

టెట్ ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల

టీఎస్ టెట్ ఎగ్జామ్ రిజల్ట్ సెప్టెంబర్ 27 న రానున్నాయి.  సెప్టెంబర్ 15న జరిగిన ఎగ్జామ్  పేపర్ 1 కు 2,69 ,557 మంది అభ్యర్థులకు గాను  226744 మంది  పరీక్ష రాశారు.  మధ్యాహ్నం జరిగిన పేపర్ 2కి 2,08,498 మంది అభ్యర్థులకు గానూ 1,89,963 మంది హాజరయ్యారు. టైమ్ దాటిన తర్వాత ఎవ్వరినీ అనుమతించలేదు. పేపర్ 1 గతంతో పోలిస్టే  క్వశ్చన్లు  ఈజీగానే ఉన్నాయని అభ్యర్థులు చెప్పారు. పేపర్ 2 మాత్రం గతంలో కంటే కఠినంగా వచ్చిందన్నారు. ముఖ్యంగా  మ్యాథ్స్, సైన్స్ టఫ్ గా వచ్చిందన్నారు. 

ALSO READ: గురుకుల హాస్టల్లో ఫుడ్ ఫాయిజన్.. 30 విద్యార్థినీలకు అస్వస్థత

రాజన్న సిరిసిల్ల జిల్లాలో  టెట్ 2 పేపరలో టెట్ తారుమారైంది. సెంటర్లలో సెకండ్సెట్ కు బదులు ఫస్ట్ సెట్ను స్టూడెంట్లకు ఇచ్చారు. అప్పటికే పరీక్ష మొదలుపెట్టిన అభ్యర్థులు ఓఎంఆర్ షీట్స్ లో ఆన్సర్స్ రాశారు.  మళ్లీ వెంటనే తప్పును గుర్తించిన అధికారులు మళ్లీ వేరే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. 

రంగారెడ్డి జిల్లా  గచ్చిబౌలి,  సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇస్నాపూర్ లో టెట్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చి మృతి చెందింది. హైబీపీతో ఎగ్జామ్ రాసే చోటనే కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు.