Thug Life Box office: థగ్ లైఫ్.. షాకింగ్ వీకెండ్ కలెక్షన్లు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?.. బ్రేక్ ఈవెన్ కష్టమే!

Thug Life Box office: థగ్ లైఫ్.. షాకింగ్ వీకెండ్ కలెక్షన్లు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?.. బ్రేక్ ఈవెన్ కష్టమే!

కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ థియేటర్లలో జూన్ 5న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. థగ్ లైఫ్ విడుదలైన నాలుగు రోజుల్లో ఇండియాలో రూ.36.52 కోట్ల నెట్ ళ్లు రాబట్టినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది.

థియేటర్లో సందడి చేయడానికి అనుకూలమైన రోజులంటే.. 'శుక్ర, శని, ఆది' వీకెండ్ డేస్లో కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇండియాలో రెండో రోజైన శుక్రవారం రూ. 7.15కోట్లు, శనివారం రూ.7.75 కోట్లు, ఇక ఆదివారం మాత్రం కేవలం రూ. 6.50 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది.

రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన థగ్ లైఫ్.. నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించకపోవడం మేకర్స్కు నిరాశ కలిగిస్తోంది. అంతేకాకుండా 'ఇండియన్ 2' మరియు 'విక్రమ్' చిత్రాలతో పోలిస్తే.. అతి తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం ఇదే.

ఇండియాలో థగ్ లైఫ్ రోజు వారీ నెట్ బాక్సాఫీస్:

జూన్ 5 గురువారం (మొదటి రోజు): రూ. 15.5 కోట్లు
2వ రోజు: రూ. 7.15 కోట్లు
3వ రోజు: రూ. 7.75 కోట్లు
4వ రోజు: రూ. 6.50  కోట్లు

మొత్తం: రూ. 36.90 కోట్లు

అయితే, బాక్సాఫీస్ వద్ద కమల్ హాసన్ గత సినిమాలు వసూళ్లను చూస్తే.. గత ఐదు సంవత్సరాలలో 'థగ్ లైఫ్' అతి తక్కువ వసూళ్లు అని చెప్పొచ్చు.

అంతేందుకు.. ప్రేక్షకులచే విమర్శించబడిన కమల్ లాస్ట్ మూవీ 'ఇండియన్ 2', దేశీయ బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లోనే  రూ.69.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. విక్రమ్ మూడ్రోజుల్లోనే రూ.110.8 కోట్ల నెట్ వసూళ్లను వసూలు చేసింది. పొన్నియన్ సెల్వన్ 1, 2 వరుసగా రూ.120.15 కోట్లు, రూ.103.75 కోట్లు రాబట్టాయి. దీన్ని బట్టి అర్ధం చేసుకోవొచ్చు థగ్ లైఫ్ ఎలా నడుస్తుందో అని!

ఇక ఈ మూవీ వారం రోజుల్లో దాని ఊపును కొనసాగించలేకపోతే, నిర్మాత కమల్ హాసన్‌కు భారీగా నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా కన్నడ భాష వివాదంతో కర్ణాటకలో ఈ మూవీ రిలీజ్ కాకపోవడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ గా రూ.106 కోట్ల షేర్, రూ.210 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకోవాల్సి ఉంది.

ఈ మూవీని కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మణి రత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ మరియు ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించాయి.